గ్యాస్ ప్రమాద బాధితులకు విస్తరణ ఇన్ఫో సహకారంతో పరిహారం
విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న విస్తరణ ఇన్ఫో సంస్థ వంట గ్యాస్ ప్రమాదం లో మృతి చెందిన నలుగురు బాధితులకు రూ.24 లక్షలు బీమా సహయాన్ని సంబంధిత ఇంధన సంస్థ నుంచి అందేలా కృషి చేసిందని సంస్థ వైస్ ప్రెసిడెంట్ కొరికాన సుజాత తెలిపారు. ములకలేడు ప్రమాదము లో నలుగురు పౌరులు మృతి చెందగా ఇద్దరు తీవ్రముగా గాయపడ్డారు అని ఏడు ఇళ్ళు పూర్తిగా ద్వంసం అయ్యాయన్న సమాచారం మీడియా ద్వారా తెలుసుకొని వెంటనే స్పందించామని అన్నారు. అనంతపురం జిల్లా సేటురు మండలము ములకలేడు గ్రామము లో గత ఏడాది మే 28 న జరిగిన ఎల్ పి జి వంట గ్యాస్ ప్రమాదము లో మృతి చెందిన నలుగురు బాధితుల కుటుంబాలకు పరిహారము అందిందని ఒక ప్రకటనలో తెలిపారు. సాదారణముగా ఎల్ పి జి గ్యాస్ ప్రమాదము లో మృతి చెందిన వారికి భీమా వర్తిస్తుందనే విషయము చాలా మందికి తెలియదని ముఖ్యముగా గ్యాస్ డీలర్లకు సహితం అవగాహన లేక పోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. ఈ విషయము లో స్తానిక గ్యాస్ అధికారులు నిర్లక్ష్యము వహించగా విస్తరణ ఇన్ఫో సంస్థ ప్రమాద బాధిత కుటుంబాల తరపున చొరవ తీసుకుని గ్యాస్ సంస్థకు లేఖలు రాయడము తో స్పందించారు అని అన్నారు. ప్రమాదములో కొలిమి సైఫుల్ల కుటంబానికి చెందినా నలుగురు మృతి చెందారని వారి వారసులకు నష్ట పరిహారము అందించారు అని తెలిపారు. మృతి చెందిన ఒక్కొక్కరికి రూ. 6 లక్షలు చొప్పున కుటుంబ సభ్యులకు సహాయము అందించారు అన్నారు. గ్యాస్ సిలిండర్ మృతుల పక్క ఇంటిలోని అబ్దుల్లా ఇంటిలో పేలిందని వారికి ఇంటికి జరిగిన నష్టము రూ.2 లక్షలు ఇచ్చారు అని తెలిపారు. . మారుమూల ములకలేడు ప్రాంతము లోని బాధితులకు అండగా నిలిచి రాతపూర్వక సహాయము చేయడము లో గ్రామానికి చెందిన పోస్టల్ ఉద్యోగి ముదలయ్య గారి తిప్పేస్వామి సహకరించారు అని పేర్కొన్నారు. గతములో విశాఖపట్నం సిటీ లోని పూర్ణా మార్కెట్ గ్యాస్ ప్రమాదము, శ్రీహరిపురము బాదితులకు భీమా ఇవ్వడానికి తమ సంవ్థ కృషి చేసిందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం లో ని ఒక ప్రమాదము లో భీమ సొమ్మును ఆనతి కాలములో అందజేయడానికి కృషి చేసాము అన్నారు. ప్రతి ఒక్కరు చట్టాలు పైన అవగాహన కలిగి వుండాలి అని విజ్ఞప్తి చేసారు. సమస్యల పరిష్కారము కోసము తమ సమస్త ను సంప్రదించాలి అని అన్నారు.