దోమలగూడ గ్యాస్ ప్రమాద బాదితులకు అన్యాయము
గ్యాస్ సరపరా దారుడు ఫై బాదితులు తరుపున సివిల్, క్రిమినల్ కోర్టులలో కేసులు
స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా జనరల్ ఇన్సురన్సు కంపని ఫై ఇన్సురన్సు అంబుడ్స్మాన్ కు
విశాఖపట్నం, నవంబర్ 22:ఇండియన్ గ్యాస్ హైదరాబాద్ ప్రాంతియ్య కార్యాలయానికి కూత వేటు దూరములో ఏల్పిజి గ్యాస్ ప్రమాదము జరిగినా సమయానికి అధికారులు, గ్యాస్ సరపరా దారుడు బాదితులను ఆదుకోవడము లో విఫలము అయ్యారు. ఈ ఏడాది జూలై 11 న జరిగిన ప్రమాదము లో ఇండియన్ గ్యాస్ అధికారులు నిర్లక్ష్యము తో ఆరుగురు మృతి చెందారు మరో వ్యక్తీ తీవ్రముగా గాయపడి అంగ వైకల్యము చెందారు. ప్రమాదము జరిగిన వెంటనే అమర్ గ్యాస్ ఏజెన్సీ కి భాదితులు,పోలిస్ అధికారులు సమాచారము అందించారు. ఏల్పిజి గ్యాస్ వినియోగదారులకు భీమా వుంటుంది అనే పరిజ్ఞానము లేని డీలర్ సోమనాద్ బాదితులకు కనీసము ఆదుకోలేదు కదా బాదితులు బాధలో వున్నప్పుడు వారిఫై ఆరోపణలు చేస్తూ మీడియా ముందు కాలక్షేపం చేసారు అని బాదితులు లాలాజీ శ్యామ్, షెంబుకర్ ఆనంద్ ఆరోపించారు. విశాఖపట్నం నగరానికి చెందినా విస్తరణ ఇన్ఫో సమస్త ఏల్పిజి గ్యాస్ వినియోగదారులకు భీమా వుంటుంది అని మీ కుటుంబ వారసులకు తక్షణ సహాయము అందిందా అని అరా తీయగా అసలు విషయము తెలిసిందని అన్నారు లాలాజీ శ్యామ్. నిబందనలు ప్రకారము మృతి చెందినా, గాయపడిన వారికీ తక్షణ సాయము రూ.25 వేలు చెల్లించాలి అని, గాయపడినవారికి రూ. 2 లక్షలు నుంచి రూ. 5 లక్షలు మొత్తము రూ.30 లక్షలవరకు మెరుగు ఆయన చికిత్శ అందించాలి అని అన్నారు. గ్యాస్ కంపని నిర్లక్ష్యము వల్లనే మా కుటుంబము మొత్తము కోల్పోయాము అని ఆవేదన వ్యక్తము చేసారు లాలాజీ శ్యామ్, షెంబుకర్ ఆనంద్. జరిగిపోయింది అలా ఉంచి మరణించిన వారికీ, గాయపడ్డవారికి భీమ ఇవ్వాలి అని విస్తరణ ఇన్ఫో ప్రతినిధులు తాము వినతిపత్రము సమర్పించామని అన్నారు. కనీసము తిరుగురాసిదు ఇవ్వలేదు అని తనకు భీమా మీద అవగాహనా లేదు అని అర్దము అయ్యంది అని బాదితులు అవేదన వ్యక్తము చేసారు.
ఇండియన్ గ్యాస్ హైదరాబాద్ ప్రాంతియ్య కార్యాలయాన్ని సంప్రదించగా ప్రమాద సంగటన తమ దృష్టికి వచ్చ్చిందని భీమా కంపినికి సమాచారము అందించాము అని తెలిపారు. విచిత్రము ఏమిటి అంటే తక్ష్నన సహాయము అందించడానికి బాదితులు డబ్బులు తీసుకున్నట్టు రసీదులు సమర్పించలేదు అని రాతపుర్వకముగా సిపిగ్రమ్స్ కు సమాధానము ఇచ్చారు. నలుగు నెలలు గా తన చుట్టూ తిప్పించుకుంటున్న అమర్ గ్యాస్ ఓనర్ ఇప్పుడు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా జనరల్ ఇన్సురన్సు వాళ్ళు మీ భీమా తిరిస్కరించారు అని చావు కబురు చల్లగా చెబుతున్నారు. అంతే కాదు ఆండీ కోర్టు లో తన గ్యాస్ అజేన్చి ఫై న ఇండియన్ గ్యాస్ ఫై నా కేస్ వేసుకొని పరిహారము తీసుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. కావాలి అంటే పక్క గ్యాస్ సంస్తాల్లో జరిజిన కేసు కాగితాలు ఇస్తాను అని కాపీ చేసి కేసు వేసుకోవాలి అని మరో మార్ఫింగ్ సలహా ఇస్తున్నాడు.