దసరా పండగ రోజు ఇంటింటికి వెళ్తూ… అయ్యవార్లకు చాలు అయిదు వరహాలు …పిల్లవాళ్లకుచాలు పప్పు బెల్లాలు…

 దసరా పండగ రోజు ఇంటింటికి వెళ్తూ… అయ్యవార్లకు చాలు అయిదు వరహాలు …పిల్లవాళ్లకుచాలు పప్పు బెల్లాలు…

ఆ రోజు ముక్కోటి ఏకాదశి (23.12.2023). గీతాజయంతి. విశాఖ నగరములోని మధురవాడలో దేముడు ప్రసాదించిన  నూతన స్వగృహం ప్రవేశం చేసి మూడో రోజు. నా ప్రియ మిత్రుడు సింహం కుటుంబ సభ్యులు తో పలకరించడానికి వచ్చిన వేల. ప్రియమిత్రులు కుటుంబంతో సహా కొత్తింటికి రాగా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం. వారిని సాగన నంపడానికి కిందికి దిగాము… ఇంతలో అటుగా  పాఠశాలా విద్యార్థులు రాలి గా వస్తున్నారు. హరేరామ! హరేకృష్ణ అంటూ భగవద్గీత బోధన విశిష్టతను శ్లోకాలు పటిస్తుంటూ వస్తున్నారు…

ఆ దృశ్యము నా మనస్సు ని మా తాత గారి ఊరిలోని బాల్యము లోకి అంతరంగము లోని గుర్తు …శబ్దాలు వినిపించాయి. దసరా పండగ రోజు మా మాస్టర్లు వెదురు బాణములు కొనిపించి వాటిలో పూలూ, పువ్వులు వేసి పెద్దల మీదకు విసరి …ఈ పాట పడేవారిమి…

ఏదయా! మీ దయ మా మీద లేదు ఎంత సేపుంచుతారు ఇది మీకు తగునాదసరాకు వస్తిమని విసవిసలు పడక!  చేతిలో లేదనక అప్పివ్వరనక! రేపురా మాపురా మళ్లీ రమ్మనకా! ఇప్పుడు లేవనక ఇవ్వలేమనక! ఇరుగు పొరుగుల వారు ఇస్తారు సుమీ!

పావలా బేడైతే పట్టేది లేదుఅర్థ రూపాయి ఇస్తే అంటేది లేదుముప్పావాలా ఇస్తే ముట్టేది లేదుఎచ్చు రూపాయిస్తే పుచ్చుకుంటాము

అయ్య వారికి చాలు అయిదు వరహాలు పిల్ల వాళ్లకు చాలు పప్పు బెల్లాలు. శీఘ్రమే పంపండి శ్రీమంతులారా! జయీ భవా ! విజయీ భవ! విజయీ భవ!

దసరాకు కొన్ని రోజుల ముందు ఈ పాట పాడుతూ ఏటా మావూరి ప్రాథమిక పాఠశాల విద్యార్థులమంతా గ్రామమంతా తిరిగేవారం. ప్రతి ఇంటి దగ్గర ఇలాంటి

పాటలు పాడి చందాలు అడిగే వాళ్లం. దసరా ముందు పై ఫొటో తరహాలో ధనుస్సు ఒకటి (గిలక) తయారు చేసి దానిని అలంకరించే వాళ్లం. ఆ బాణం చివర గిలకలో రకరకాల పువ్వులుమారేడుఉసిరి తదితం ఆకులు నింపేవాళ్లం. మాకు చందా ఇచ్చిన తరువాత ఆ దసరా విల్లు సంధించి వారి గడపంతా మారేడుఉసిరి పత్రిలతో నింపేవాళ్లం. మేము వసూలు చేసిన చందాల మొత్తాన్ని మా ఉపాధ్యాయులకు సమర్పించే వాళ్లం. మా ఉపాధ్యాయులు ఆయా కుటుంబీకులను జయీ భవా ! విజయీ భవ!‘ అంటూ ఆశీర్వదించేవారు.

ఏమిటని ఆరా తీస్తే వారు మధురవాడలోని ప్రైవేటు పాఠశాల శ్రీ వేంకటేశ్వర విద్యామందిర్ చిన్నారులు. వారు భగవద్గీత శ్లోకాలను పఠించడమే కాకుండా గ్రామంలో తిరుగుతూ ప్రజలకు గీతోపదేశం చేయడం విశేషంగా ఆశ్చర్యం కలిగించింది. గొప్పలు చెప్పుకునే పెద్దలు సైతం తలవంచుకునేలా ఆ చిన్నారులు భగవద్గీతను పఠించడం ఒకఎత్తైతేయాజమాన్యం సొంతఖర్చుతో చూడచక్కని రంగుల్లో పదివేల గీత ప్రతులు20 వేల కరపత్రాలను ముద్రించి ప్రజలకు ఇంటింటికి తీసుకెళ్లి ఉచితంగా పంపిణీ చేసింది. ఇందుకు విద్యాసంస్థల అధినేత ఏటూరి వెంకటేశ్వర్లు చొరవ చూపగావైస్ఛర్మన్ వినయ్ వికాస్డైరెక్టర్లు సంధ్యప్రణీతఉపాధ్యాయులుసిబ్బందివిద్యార్థుల తల్లిదండ్రులు చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. ఇందులో ముక్కోటి ఏకాదశిగీతాజయంతి రోజు మాకు ఎదురుపడి గీతా శ్లోకాలను ముద్దుముద్దుగా పఠించిన చిన్నారులకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని ఆ సర్వాంతర్యామిని ప్రార్థిస్తున్నా.

అంతర్జాతీయంగా హరేరామ! హరేకృష్ణ

సనాతన సంప్రదాయ పద్ధతులుపురాణేతిహాసాలుభగవద్గీతల పరిమళాలను ఎప్పుడో స్వామివివేకానంద అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పటి పరిణామాలు ఆ పునాది పైనే సంప్రదాయ పీఠాలు వెలుస్తున్నాయి. ఇటీవల విదేశాల్లో నిర్మితమైనప్రారంభమైన శ్రీ కృష్ణ మందిరాలు ఎన్నో ఉన్నాయి. ఆంగ్ల భాష మోజువిదేశీ సంస్కృతి మోజులో ఇవన్నీ ఇక్కడ మరుగున పడుతున్న సమయంలో శ్రీ వేంకటేశ్వర విద్యామందిర్ విద్యార్థులతో చేపట్టిన కార్యక్రమం తన్మయత్వం కలిగించింది. భగవద్గీత బోధనదసరా గిలకల ఉత్సవం గురుశిష్య సంబంధాల ప్రక్రియసమాజ నిర్మాణంఆధ్యాత్మిక సోయగాల కళలే. యుద్ధరంగాన శత్రువుకు వెన్ను చూపరాదనిఎందుకు ఇది అవసరమో వివరిస్తూ అర్జునుడిని కార్యోన్ముఖుడిని చేస్తూ శ్రీకృష్ణపరమాత్మ ప్రబోధిస్తారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *