Generally, the first words written in good letters are … Srirastu… Subhamastu…. Avighnamastu. But a person from the city of Visakhapatnam created a New trend (Kottavaravadi) by writing Matra…Sreekaramu…Shubakaramu…Nijakaramu. He is justifying himself as he found in his research that this is necessary for the present generation. It is said that there is a lot of story behind this and soon the full details will be published in the book. In a wedding card before independence, according to the current conditions of the country at that time, instead of blessed words like Srirastu, Abhyudayamastu, Shanti, and Swatanram were printed. He also reminded me that it has gone viral in many media. He opined that the word Avighnamastu has many wrong meanings. It was mentioned that Avighnamastu was used as the meaning of the word vacation in some daily newspapers.
వైరల్ అవుతున్న గృహప్రవేశ ఆహ్వానం
సర్వ సాదారనము గా శుభలేఖల్లో ముందుగా రాసే పదాలు … శ్రీరస్తు…. శుభమస్తు…. అవిఘ్నమస్తు. కానీ విశాఖపట్నం నగరానికి చెందిన ఓ వ్యక్తి మాత్రము…శ్రీకరము… శుభకరము…నిజకరము అని రాసి కొత్తవరవడి సృష్టించారు. ప్రస్తుత తరానికి ఇది అవసరము అని తన పరిశోధన లో గుర్తించినట్టు తనను తాను సమర్ధించుకుంటున్నారు. దీని వెనుక చాలా కధ వుందని త్వరలో పూర్తివివరాలు పుస్తకము లో ప్రచురిస్తాను అని అంటున్నారు. స్వతంత్రం కు ముందు జరిగిన ఒక పెళ్లి పత్రికలో ఆనాటి దేశ కాలమాన పరిస్థితుల బట్టి ఈ శ్రీరస్తు లాంటి ఆశీర్వచన పదాల బదులు అభ్యుదయమస్తు అని, శాంతి , స్వతంత్రం అని అచ్చు వేసి ముద్రించారట. ఇది చాలా మాధ్యమాల్లో వైరల్ అయింది కూడా ఆయన గుర్తు చేసారు. అవిఘ్నమస్తు అనే పదము కు చాలా తప్పుడు అర్దాలు వస్తాయని ఈయన అభిప్రాయపడ్డారు. కొన్ని దిన పత్రికల్లో సెలవు అనే పదానికి అర్ధము గా అవిఘ్నమస్తు వాడిన విషయము గుర్తుచేసారు.