No immediate relief to L Kota LPG accident victims family

ఎల్ కోట ఎల్పిజి ప్రమాద బాధితులకు తీవ్ర అన్యాయం
ఆలస్యంగా స్పందించిన అధికారులు…. ఇంకా అందని తక్షణ సహాయం… వైద్య సహాయం

విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం కేంద్రంలో జరిగిన భారత్ గ్యాస్ ఎల్పీజీ ప్రమాదంలో విజయవాడ రీజినల్ఎ ల్పిజి సేల్స్ అధికారులు స్పందించారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన అధికారులు వివరాలను సేకరించిన నాయకులకు అందాల్సిన తక్షణ సహాయాన్ని కానీ తక్షణ వైద్య సహాయాన్ని ఇప్పటివరకు అందించలేదు. డీలర్ నిర్లక్ష్యంతో సకాలంలో సమాచారం తెలుసుకోలేని అధికారులు ఎలా తప్పించుకోవాలనే విషయంపై కుంటి సాకులు వెతుకుతున్నారు. ఈ విషయంపై విస్తరణ ఇన్ఫో సంస్థ కేంద్ర ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వ ఫిర్యాదుల విభాగం ద్వారా సమాచారాన్ని అందించింది. గత ఏడాది నవంబర్ 19న జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడగా అందులో నలుగురు ఇప్పటికే మృతి చెందారు. గ్యాస్ అధికారులు ఎవరూ పట్టించుకోలేదు అని విస్తరణ మాస్ కమ్యూనికేషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ కొరికన సుజాత ఆరోపించారు. ప్రమాద విషయం ఆలస్యంగా తమ దృష్టికి వచ్చిందని ఎల్పిజి బీమా విషయాన్ని బాధితులకు  వివరించి పూర్తి వివరాలు తెలుసుకొని తెలుసుకొని భారత్ గ్యాస్ రీజినల్ ఆఫీస్ కు సమాచారం అందించామని తెలిపారు ఈ మేరకు సంబంధిత రీజినల్ గ్యాస్ సేల్స్ అధికారి ప్రమాద స్థలానికి ఈరోజు సందర్శించారని చెప్పారు ఇందులో విషయం ఏంటంటే వచ్చిన అధికారికి తెలుగు రాకపోవడం విశేషం గ్యాస్ సిబ్బంది చెప్పిందే రాసుకుంటూ వెళ్లిపోయినట్లు తెలిసింది.అలాగే బాధితులతో ఫోన్లోనే  మాట్లాడినట్లు తమ సంస్థకు సమాచారం అందించారు. వాస్తవ సమాచారం అందిందని వివరించారు. బాధితులు ప్రధమంగా గ్యాస్ అధికారులను తమను సంప్రదించడం కొంతవరకు ఊరటకలిగించిందని ఆనందం వ్యక్తం చేశారు వారికి సహాయం చేయాలని ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రావలసిన బీమా సౌకర్యాన్ని వర్తింప చేయాలని కోరారు .గ్యాస్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం ఆరు లక్షల రూపాయలు మృతి చెందిన వారికి గాయపడిన వారికి చికిత్స అందించడానికి రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఖర్చు చేయడానికి అనుమతిస్తుంది.ఇంకో విశేషమేంటంటే ప్రమాద సంఘటన జరిగిన వెంటనే గాయపడిన ప్రతి బాధితులకు 25000 చొప్పున సహాయాన్ని అందించాలి కానీ ఇక్కడ భారత్ గ్యాస్ స్థానిక డిస్ట్రిబ్యూటర్ పూర్తిగా తానే సర్వం అంటూ బాధితులకు పైసా రాదంటూ సర్టిఫికెట్ జారీ చేసేసారు .దీనిపై చివరి వరకు పోరాటం చేసి బాధితులకు న్యాయం చేస్తామని విస్తరణ ఇనుప సంస్థ తెలిపింది. తమ సంస్థ ఇప్పటివరకు విశాఖ నగరంలో 2012 లో జరిగినటువంటి గ్యాస్ ప్రమాదం నుంచి హైదరాబాదులో జరిగినటువంటి ఎన్నో ప్రమాద సంఘటనలో ఇన్సూరెన్స్ను వచ్చేటట్లు కృషి చేసిందని తెలిపారు. అనంతపురం జిల్లా సేతూరు మండలం మొలకలేళ్లు జరిగినటువంటి గ్యాస్ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా వారికి 24 లక్షల రూపాయలు ఇండియన్ గ్యాస్ కంపెనీ నుంచి ఇప్పించినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *